త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్‌గా సౌరవ్

టీం ఇండియా సౌరవ్ గంగూలీ బీజేపీ పాలిత త్రిపుర బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. భారత మాజీ కెప్టెన్ త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరితో మంగళవారం కోల్‌కతా నివాసంలో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం అధికారికంగా సౌరవ్ గంగూలీ తెలిపారు.

‘‘భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలనే మా ప్రతిపాదనను అంగీకరించడం గర్వించదగిన విషయం. ఈ రోజు ఆయనతో టెలిఫోనులో సంభాషించాను. గంగూలీ జీ భాగస్వామ్యం ఖచ్చితంగా త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిస్తుందని విశ్వసిస్తున్నాను.’’ అని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తెలిపారు. త్రిపుర రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు త్రిపుర టూరిజం మంత్రి సుశాంత చౌదరి చెప్పారు.