చిత్రసీమలో మరో పెనువిషాదం : దర్శకుడు కె.ఎస్ సేతు మాధవన్ మృతి

చిత్రసీమలో వరుస విషాదాలు సినీ ప్రముఖులను,ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత ఏడాదిగా కరోనా కారణంగానే..కాకుండా పలు కారణాలతో చాలామంది కన్నుమూశారు. రీసెంట్ గా సిరివెన్నెల కన్నుమూయగా..ఆ విషాదం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న క్రమంలో మరో విషాదం చోటుచేసుకుంది.

దక్షిణ భారత ప్రముఖ దర్శకుడు కె.ఎస్ సేతు మాధవన్ (95) మృతి చెందారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఈయన నిన్న రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో మరణించారు. 1961 సంవత్సరంలో మలయాళం లో.. దర్శకుడి గా కెరీర్ మొదలు పెట్టి తమిళ, కన్నడ, హిందీ భాషలలో 60 సినిమాలకు పైగా దర్శకుడి గా వ్యవహరించారు. ఇక తెలుగులో 1960 సంవత్సరంలో వచ్చిన స్త్రీ సినిమాను సేతు మాధవ డైరెక్ట్ చేశారు. ఇక తన కెరీర్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అందుకున్నారు. ఇక ఆయన మరణవార్త తెలిసిన ప్రముఖులు.. ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.