రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ బుల్లితెర నటి

నిత్యం రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నాయి. అతివేగం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ , మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బుల్లితెర నటి, హిందీ సీరియల్ సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌ ఫేం వైభవీ ఉపాధ్యాయ కన్నుమూశారు.

మంగళవారం మధ్యాహ్నం హిమాచల్ ప్రదేశ్‌లో వైభవీ తనకు కాబోయే భర్తతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఈమె మరణ వార్త తెలిసి బాలీవుడ్​ సినీ, టెలివిజన్​ ఇండస్ట్రీ షాక్​కు గురైంది. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్​ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగా మంబయిలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయంటూ కుటుంబసభ్యులు తెలిపారు.