తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ను విడుదల చేసింది ఇంటర్‌ బోర్డు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు వార్షిక పరీక్షలు నిర్వహించబోతున్నట్లు , ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వరకు ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది.

ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ ఎగ్జామ్‌ను 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ఎగ్జామ్స్‌ విభాగం జాయింట్‌ సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.