ఆరు గంటల పాటు కొనసాగిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ విచారణ

డ్రగ్స్ కేసులో భాగంగా ఈడీ అధికారులు ఈరోజు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ని విచారించారు. దాదాపు ఆరు గంటలపాటు విచారించిన అధికారులు..రేపు మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. విచారణ పూర్తి కాగానే మీడియా తో రోహిత్ మాట్లాడారు.

ఈడీ అధికారులు తనను కేవలం బయోడేటా గురించి అడిగారని .. విచారణ కోసం మళ్లీ రేపు ఉదయం 10.30 కి రమ్మని చెప్పారని తెలిపారు.ఎలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్‌ గురించి ప్రశ్నించలేదని వివరించారు. తనపై వస్తున్న ఆరోపణల గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగలేదన్నారు. ఈ క్రమంలోనే తానే అధికారులను ఎదురు ప్రశ్నించానని రోహిత్ రెడ్డి తెలిపారు. తనను ఏ కేసు గురించి విచారిస్తున్నారని అధికారులను అడిగానని.. కానీ వాళ్లు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదన్నారు.

తాను అయ్యప్ప దీక్షలో ఉన్నానని.. ఈ నెల 31 వరకు దీక్ష సమయం అయిపోతుందని అధికారులకు రోహిత్ రెడ్డి తెలిపారు. తనకు కొంచెం సమయం ఇవ్వాలని ఉదయం పూట ఈడీ అధికారులు లేఖ రూపంతో విజ్ఞప్తి చేయగా.. అధికారులు ఆ విజ్ఞప్తిని కొట్టిపారేశారు.