‘ రావణాసుర ‘ నుండి ప్యార్ లోనా పాగల్ సాంగ్ రిలీజ్

మహాశివరాత్రి సందర్బంగా రావణాసుర నుండి ప్యార్ లోనా పాగల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న మాస్ రాజా రవితేజ..ప్రస్తుతం రావణాసుర మూవీ తో ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ఎందుకు రాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అలాగే ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతుండగా.. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్జి టీం వర్క్స్ బ్యానర్స్ పై సినిమా నిర్మితమవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా ఆంథెమ్‌ సాంగ్ ను ఈ మధ్యనే రిలీజ్ చేసినా మేకర్స్..ఈరోజు శివరాత్రి సందర్బంగా సెకండ్ లిరికల్ వీడియోగా ప్యార్ లోనా పాగల్ ని విడుదల చేశారు.

ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశాడు. ఈ పాటకున్న విశేషం ఏంటంటే మాస్ మహారాజా రవితేజ ఈ పాటని పాడటం. ఫరియా అబ్దుల్లాని టీజ్ చేస్తూ బ్రేకప్ సాంగ్ గా ఈ పాట సాగింది. పేరుకు బ్రేకప్ సాంగే అయినా రవితేజ తనదైన మార్కు సిగ్నేచర్ స్టెప్పులతో అదరగొట్టాడు. విజయ్ కార్తీక్ కన్నన్ కలర్ ఫుల్ విజువల్స్ తో పాట మరింత కలర్ ఫుల్ గా సాగింది. ఈ మూవీకి శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందిస్తుండగా అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

YouTube video