ఈ నెల 24 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కాబోతున్న మైఖేల్

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుండి ఆహా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో హీరోగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన సందీప్..మొదటి మూవీ తోనే సూపర్ హిట్ అందుకొని వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత వరుస గా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కానీ పెద్దగా విజయం అందుకోలేకపోయారు. ఇటీవల కాస్త గ్యాప్ తీసుకొని మైఖేల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీ మొదటి రోజు మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

దీంతో రెండో రోజు నుండే కలెక్షన్లు పడిపోయాయి. మూడు రోజులకే థియేటర్స్ నుండి వెనక్కి వెళ్ళింది. ఈ చిత్ర ఓటిటి రైట్స్ దక్కించుకున్న ఆహా…ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది. ఈ నెల 24 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. రంజిత్ జయకోడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించడగా.. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్ తదితరులు నటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ నిర్మించారు.

ఇక ఈ సినిమా ఎలా ఉందనేది అభిమానులు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రకారం సినిమాకు నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. స్టోరీ, నేరేషన్, పాత సినిమాను చూసిన ఫీలింగ్ ఈ చిత్రానికి మైనస్‌గా మారాయని అంటున్నారు. సందీప్ కిషన్ మాత్రం గత చిత్రాలకు భిన్నంగా నటించారు. ఈ మూవీ కోసం ఎంతో కష్టపడినట్లు తెరపై కనిపిస్తుందని చెపుతున్నారు.