రాజమౌళి సినిమా కోసం మహేష్ తెగ కష్టపడుతున్నాడు

ఆర్ఆర్ఆర్ మూవీ తో ఆస్కార్ బరిలో తెలుగు సినిమాను తీసుకెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి..ప్రస్తుతం మహేష్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. రాజమౌళి సినిమా ఎలా ఉంటుందో..నటి నటులను ఏ విధంగా కష్టపడతాడో తెలియదు కాదు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. నచ్చిన అవుట్ ఫుట్ వచ్చే వరకు వదలరు. పాత్రలు, సన్నివేశాల విషయంలో కూడా అంతే. ముఖ్యంగా ప్రధాన పాత్రల లుక్ గురించి పర్టిక్యులర్ గా ఉంటారు. హీరో తాను అనుకున్న షేప్ లో ఉండాలి. బాహుబలి సినిమా విషయంలో ప్రభాస్, రానాలను రాజమౌళి చాలా కష్ట పెట్టారు. అలాగే ఆర్ఆర్ఆర్ లోను ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు విపరీతంగా కష్టపడ్డారు. ఇక ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది.

తాజాగా మహేష్ జిమ్​లో కసరత్తులు చేస్తూ.. ఇంటెన్స్ వర్కవుట్​తో కండలు పెంచేస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నా ఫేవరెట్‌ స్కిల్ మిల్‌ ఫినిషర్‌తో నా శనివారం మొదలైంది. ఒక నిమిషం ల్యాండ్‌మైన్‌ ప్రెస్‌, ఒక నిమిషం కెటిల్‌బెల్‌ స్వింగ్స్‌, ఒక నిమిషం స్కిల్‌మిల్‌ రన్‌ పూర్తి చేశాను. మీరు ఎన్ని సెట్స్‌ చేయగలరు అంటూ ప్రశ్నిస్తూ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆయన రెగ్యులర్ వర్క్ అవుట్ అని చెబుతున్నా.. రాజమౌళి సినిమా కోసం అంటూ ప్రచారం జరుగుతుంది.
మహేష్ బాబుని సిక్స్ ప్యాక్ లో చూసింది లేదు. మహేష్ కండలు పెంచి కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఊహించినదానికి మించి ఇవ్వడంలో రాజమౌళి దిట్ట. కాబట్టి మహేష్ ని గతంలో ఎన్నడూ చూడని లుక్ లో రాజమౌళి ప్రజెంట్ చేస్తారు అనడంలో సందేహం లేదు.

https://www.instagram.com/reel/CuJl1OGsXPq/?utm_source=ig_web_copy_link