ప్రధాని మోడీతో మెగా కోడలు భేటీ..

దేశ ప్రధాని మోడీతో మెగా కోడలు ఉపాసన భేటీ అయ్యారు. ఇండియన్ ఎక్స్‌పో 2020 లో భాగంగా మోదీతో ఆమె సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోను, ఇతర విశేషాలను ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నెటిజెన్లతో పంచుకున్నారు.

నరేంద్ర మోడీ గారిని దుబాయ్ 2020 ఎక్స్‌పో వద్ద భేటీ అవ్వడంతో ఎంతో గౌరవప్రదంగా అనిపించింది. ఎన్నో రకాల కొత్త ఆవిష్కరణలు, ఆరోగ్య పరిరక్షణ పద్దతులు, మహిళా సాధికారత, మన సంస్కృతిని భద్రంగా కాపాడటమనేది ముఖ్య లక్ష్యం. ప్రధానికే తన యోగా క్లాసులు తనకే చెప్పడం ఎలా సాధ్యమవుతుందో ఊహించుకోండి.. నమ్మశక్యంగానీ ఈ సాంకేతిక, ఆవిష్కరణ, దేన్నైనా సాధించే సత్తా ఉందని నిరూపిస్తుంది. చంద్రుని మీద దక్షిణ ధృవంపై నీరు ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు ఇండియానే మొట్టమొదటి సారిగా చంద్రయాన్ ప్రయోగం చేసిందని మీకు తెలుసా?

ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు ఈ ఎక్స్‌పో కార్యక్రమంలో ఉన్నాయి. మీ మీ పిల్లలను అక్కడికి తీసుకెళ్లండి. ఇలాంటి గొప్ప అవకాశాన్ని మిస్ అవ్వకండి.. మాస్కులు ధరించండి.. రెగ్యులర్‌గా శానిటైజ్ చేసుకోండి.. భౌతిక దూరం పాటించండి.. అప్పుడే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు అని ఉపాసన చెప్పుకొచ్చారు.