తెలంగాణలో దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్..ఈరోజు భారీగా పెరిగిన కేసులు

four-more-omicron-cases-detected-in-rajasthan-delhi-each

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు ప్రజలను దడ పుట్టిస్తున్నాయి. ఒకటి రెండు నుండి పదుల సంఖ్య లో నమోదు అవుతున్నాయి. ఈరోజు ఒక్క రోజే 14 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్నటి వరకు మొత్తం కేసులు 24 ఉన్న సంగతి తెలిసిందే. 14 కేసులతో కలిపి 38కి చేరింది. 14 కేసులు విదేశాల నుంచి వచ్చినవారేనని తెలుస్తోంది. ప్రైమరీ కాంటాక్ట్ ట్రేస్ చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.

ఇక 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 259 మంది శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ (ఆర్‌జీఐఏ) కు వచ్చారు. వారందరికీ కరోనా ఆర్టీ పీసీఆర్‌ టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు.

మొత్తంగా ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 9,381 మంది ప్రయాణికులకు ఆర్‌జీఐఏలో కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 63 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌‌కు పంపించారు. వారిలో 22 మందికి ఇప్పటికే ఒమిక్రాన్‌ నెగిటివ్‌ వచ్చింది. మిగిలిన వారిలో 38 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలగా.. మరో నలుగురి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఇక రాజ‌న్న‌సిరిసిల్ల జిల్లాను ఓమిక్రాన్ భ‌యం వెంటాడుతుంది. ఇటీవ‌ల దుబాయ్ నుంచి వ‌చ్చిన జిల్లా వాసికి ఓమిక్రాన్ వ‌చ్చింది. అయితే అత‌న్ని అధికారులు హైద‌రాబాద్ లోని టిమ్స్ ఆస్ప‌త్రికి త‌రలించారు. అయితే అత‌ను దుబాయి నుంచి వ‌చ్చిన త‌ర్వాత దాదాపు 62 మందిని క‌లిసాడు. దీంతో అత‌ని ప్రైమ‌రీ కాంటాక్ట్ లీస్ట్ 62 ఉంది. ఆ 62 మంది శాంపిల్స్ ను సేక‌రించి కరోనా టెస్టులు నిర్వ‌హిస్తున్నారు. అయితే అందులో ఓమిక్రాన్ బాధితుడి తల్లికి, భార్య కు క‌రోనా పాజిటివ్ రావడం తో జిల్లా లో ఓమిక్రాన్ టెన్ష‌న్ వాతావర‌ణం నెల‌కొంది.