పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన ట్వీట్ ..

పుట్టబోయే బిడ్డ గురించి మెగా కోడలు ఉపాసన ట్వీట్ చేసింది. ఉపాసన తల్లి కాబోతుందనే విషయం మెగా అభిమానులను సంతోషానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కొంతమంది ఉపాసన సరోగసి ద్వారానే ఉపాస‌న బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుందంటూ ప్రచారం చేసారు. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని తేల్చింది ఉపాసన. తన సోషల్ మీడియా పేజీ లో బేబి బంప్‌తో ఉన్న ఫొటోల‌ను షేర్ చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి తనకు పుట్టబోయే బిడ్డ గురించి ప్రస్తావిస్తూ ఉపాసన ట్వీట్ చేసింది.

గత కొద్ది రోజులుగా ఈ జంట యునైటెడ్ స్టేట్స్ లో తమ మొదటి బిడ్డని కనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ వార్తలకు చెక్ పెట్టింది ఉపాసన. భారతదేశంలోనే మా మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని ట్వీట్ చేసింది.

“స్వదేశంలో మొదటి బిడ్డను ప్రసవించేందుకు నేను సంతోషిస్తున్నాను. మా జీవితంలోకి ఈ కొత్త దశ కోసం మేము చాలా నిరీక్షణతో ఎదురుచూస్తున్నాం. డాక్టర్ సుమన మనోహర్ మరియు డాక్టర్ రుమాసిన్హా అపోలో ఆసుపత్రులలో OB/ GYN బృందంలో భాగంగా ఉంటారు. అలాగే అమెరికా నుండి బోర్డు సర్టిఫైడ్ ప్రసూతి వైద్యురాలు జెన్నీఫర్ ఆస్టన్ కూడా మా బిడ్డ ప్రసవంలో భాగం అవుతారు” అని ట్వీట్ చేసింది.