షూటింగ్ లో గాయపడ్డ సమంత..

సినీ నటి సమంత షూటింగ్ లో గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో సామ్ గాయపడినట్లు తెలుస్తుంది.ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి నుండి బయటపడడంతో తిరిగి షూటింగ్ లో బిజీ అయ్యింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో సమంతకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన రాజ్ అండ్ కె దర్శకులతో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్లో నటిస్తుంది. ఈ సిరీస్ లోని యాక్షన్ సన్నివేశాల షూటింగ్లో పాల్గొన్న సమంతకి గాయాలు అయ్యాయి. తన రెండు చేతులకు గాయాలైనట్లు ఫోటోని షేర్ చేసిన సమంత ‘పర్క్స్ ఆఫ్ యాక్షన్’ అంటూ కామెంట్ పెట్టింది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంత షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

‘సిటాడెల్’ సినిమాలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నాడు. ‘ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ తీసిన దర్శక ద్వయం రాజ్ – డికే ఈ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ తీస్తున్న ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌కి ఇది భారతీయ వర్షన్. ఒరిజినల్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మడ్డెన్, స్టాన్లీ టుస్సీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక తెలుగు లో సమంత శాకుంతలం మూవీ తో పాటు విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ లో నటిస్తుంది.