యూపీ ఎన్‌కౌంట‌ర్‌లో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ కాల్చివేత

గుఫ్రాన్‌పై 13కుపైగా హత్య, దోపిడీ, లూటీ కేసులు

up-criminal-gufran-shot-dead

వాంటెడ్ క్రిమిన‌ల్‌ను పోలీసులు హ‌త‌మార్చారు. కౌషాంబి జిల్లాలో ఆ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. నిందితుడిని గుర్ఫాన్‌గా గుర్తించారు. మ‌ర్డ‌ర్‌, చోరీ లాంటి అనేక కేసులు అత‌నిపై ఉన్నాయి. కౌషాంబి జిల్లాలో ఇవాళ ఉద‌యం 5 గంట‌ల‌కు కూంబింగ్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో గుర్ఫాన్ పోలీసుల‌కు ఎదురుప‌డ్డాడు. క్రాస్ ఫైరింగ్‌లో అత‌ను గాయ‌ప‌డ్డాడు. గాయాల‌తో ఆస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్ల‌గా, అప్ప‌టికే అత‌ను మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు తేల్చారు. ప్ర‌తాప్‌ఘ‌డ్‌తో పాటు ఇత‌ర జిల్లాల్లో గుర్ఫాన్‌పై మొత్తం 13 కేసులు ఉన్నాయి. అత‌న్ని ప‌ట్టి ఇస్తే ల‌క్ష ఇస్తామ‌ని గ‌తంలో యూపీ పోలీసులు రివార్డు కూడా ప్ర‌క‌టించారు. యూపీ సీఎంగా యోగి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అక్క‌డ 185 మంది క్రిమిన‌ల్స్‌ను హ‌త‌మార్చారు.