విమానంలో సినీ నటి నడుము పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించిన వ్యాపార వేత్త

మహిళ కనిపిస్తే చాలు కొంతమంది మగవారిలో కామం తన్నుకొని వస్తుంది. మనం ఎక్కడ ఉన్నాం..ఏంచేస్తున్నాం అనేది పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంటారు. తాజాగా బుల్లితెర నాటికీ విమాన ప్రయాణం లో ఓ వ్యాపారవేత్త నుండి లైంగిక వేదింపులు గురయ్యాయి. ముంబైలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఓవర్‌ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న తన లగేజీని తీసుకునేందుకు నటి లేచి నిల్చోగా పక్క సీట్లో ఉన్న వ్యాపారవేత్త ఆమె నడుమును పట్టుకుని ఒక్కసారిగా లాగి తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నాడు. ఈ ఘటన తో ఆమె షాక్ కు గురైంది. ఆ తర్వాత ఆమెకు అతడు సారీ చెప్పాడు. మగవారు అనుకోని అలాచేసానని చెప్పుకొచ్చాడు.

ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని విమానయాన సంస్థకు మెయిల్ చేసి ఆ వ్యక్తి వివరాలు కావాలని కోరింది. అయితే, అతడి వివరాలను తాము ఇవ్వలేమని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. దీంతో ఆమె ఆ తర్వాతి రోజున ముంబైలోని సహర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన నిందితుడైన వ్యాపారవేత్తను ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు.