చెట్టును పెళ్లి చేసుకోబోతున్న నయనతార..?

నయనతార – డైరెక్టర్ విఘ్నేష్ ల ప్రేమాయణం గురించి తెలియంది కాదు..గత కొద్దీ నెలలుగా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. అయితే పెళ్లి చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయట. నయనతార పుట్టుక దోషాలు ఉన్నాయట.. ఆ దోషాలకి తగ్గ పరిహారం చేసిన తర్వాత వివాహం చేసుకుంటే మంచిదని..లేదంటే భర్తకు అన్నీ కష్టాలే ఉంటాయని వేద పండితులు అన్నారట.

ఈ నేపథ్యంలో నయన్ అవసరమైన అన్ని ఘట్టాల్ని పూర్తిచేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ముందుగా విఘ్నేష్ ని పెళ్లి చేసుకోవాలంటే అంతకంటే ముందే ఆమె ఓ చెట్టును వివాహం చేసుకోవాలట. అప్పుడే ఆ దోషం తొలగిపోతుందని వేద పండితులు చెప్పారట. ఇది పురాతన ఆచారంలో ఓ భాగమని చెప్పడంతో.. జ్యోతిష్యుల సూచన మేరకు నయన్ చెట్టును వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.