మరో 3 రోజులు గుంటూరు జీజీహెచ్ లోనే

ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు

Achennaidu in GGH
Achennaidu in GGH

Guntur: ఈఎస్ఐ కుంభకోణంలో ఏపీబీ అరెస్టు చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయనకు గతంలో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. అరెస్టయిన తరువాత ఆయనను అధికారులు సుదీర్ఘ దూరం విజయవాడ వరకూ వాహనంలో తీసుకురావడంతో శస్త్రచికిత్స గాయం తిరగబెట్టడంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కోర్టు ఆయనను 14 రోజుల రిమాండ్ కు ఆదేశించిన సంగతి తెలిసిందే.

కాగా అచ్చెన్నాయుడు మరో మూడు రోజుల పాటు జీజీహెచ్ లోనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం :https://www.vaartha.com/specials/health1/