అమ్మాయిల రక్షణకోసం కొత్త చట్టాన్ని తీసుకరాబోతున్న తెలంగాణ సర్కార్

స్కూల్స్ , కాలేజీ లలో చదువుకునే అమ్మాయిల రక్షణ కోసం కొత్త చట్టాన్ని తెలంగాణ సర్కార్ తీసుకరాబోతున్నట్లు సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ఏక్కడ కూడా ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. పోలీసులు , కోర్టులు ఎన్ని చట్టాలు తీసుకొస్తూ..ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ కామాంధులు , ఆకతాయిలు ఆడవారిపై రెచ్చిపోతూనే ఉన్నారు. స్కూల్స్, కాలేజీ లలోనే కాదు ఇంట్లో ఉండే ఒంటరి మహిళలపై కూడా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ అమ్మాయిల రక్షణకోసం కొత్త చట్టాన్ని తీసుకరాబోతుంది. ఈ విషయాన్నీ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

ఓయూ ఠాగూర్‌ స్టేడియంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సు జరిగింది. కార్యక్రమంలో సీపీ సీవీ ఆనంద్‌, ఓయూ వీసీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ స్కూల్స్‌, కాలేజీల్లో అమ్మాయిలపై అఘాయిత్యాల నివారణకు ప్రత్యేక చట్టం తేనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ప్రత్యేక చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు. డీవీఏ స్కూల్‌లో జరిగిన ఘటన తర్వాత చట్టంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే స్కూల్స్‌, కాలేజీల్లో చిన్నారులు, యువతులపై అఘాయిత్యాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

యాంటీ డ్రగ్స్‌ కమిటీల మాదిరిగానే ఈ చట్టం పని చేస్తుందన్నారు. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగిస్తున్న వారి సంఖ్య 11కోట్లుగా ఉందని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు సైతం మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.

డీఏవీ పాఠశాల ఘటన తర్వాత చట్టంపై సర్కారు పూర్తి ఫోకస్ పెట్టినట్టు సీవీ ఆనంద్ తెలిపారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా పాఠశాలలు, కళాశాలల్లో జరుగుతున్నాయన్న సీపీ… యాంటీ డ్రగ్స్ కమిటీలలాగానే ఈ చట్టం కూడా పనిచేస్తుందని వివరించారు.