‘వాట్సాప్’కు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు

కొత్త ప్రైవసీ పాలసీని వెనక్కి తీసుకోవాలని, 7రోజుల్లో వివరణ కోరుతూ ఆదేశాలు

'WhatsApp'
‘WhatsApp’

New Delhi: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ కొత్త ప్రైవసీ పాలసీని విత్ డ్రా చేసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని వాట్సాప్‌కు నోటీసులు పంపింది. లేకుంటే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ విధానం ద్వారా భారత్‌ పౌరుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదముందని,. డేటా ప్రైవసీ, డేటా భద్రత, యూజర్ల ఎంపికలకు ఈ విధానం వ్యతిరేకంగా ఉందని నోటీసుల్లో పేర్కొంది. 7రోజుల్లోగా దీనిపై సరైన వివరణ కోరుతూ ఆదేశాలు జారీ చేసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/