ట్విట్టర్లో బ్లూ టిక్‌కు నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే..!

twitter-blue-tick-on-sale-for-usd-8-per-month

న్యూయార్క్‌ః టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ పూర్తి చేసిన తర్వాత ఎన్నో మార్పులు చేయనున్నారన్న వార్తలు నిజం కానున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ ఉద్యోగుల్లో భారీ కోత ఉంటుందంటున్న ప్రచారం జరుగుతుండగా.. ఇటీవలే అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఛార్జీలు సవరించారు. మొదటగా 20 డాలర్లుగా ప్రతిపాదించినా.. ఆ తర్వాత దాన్ని 8 డాలర్లకు తగ్గించినట్టు తెలుస్తోంది. అంటే ఒక ట్విట్టర్ యూజర్ బ్లూ టిక్ పొందాలంటే నెలకు రూ.664 చెల్లించాలన్నమాట.

బ్లూ టిక్ కోసం 20 డాలర్లు చెల్లించాలన్న ఆలోచనను చాలా మంది వ్యతిరేకించడంతో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మన దేశంలో ట్విట్టర్ వాడే వారు కోట్లలో ఉన్నారు. వారిలో ట్విట్టర్ యాక్టివ్ యూజర్లు దాదాపు 24 మిలియన్లకు పైగానే ఉంటారు. అంటే ఒక్కొక్కరికీ 8 డాలర్లు వేసుకున్నా కూడా 24 మిలియన్ల మంది నుంచి ట్విట్టర్‌కు నెలకు రూ. 1660 కోట్లు రానున్నాయి. అయితే ఈ బ్లూ టిక్ పొందిన వారికి ప్రియారిటీ రిప్లేస్, మెన్షన్స్ అండ్ సెర్చ్ వంటి మరికొన్ని సౌకర్యాలనూ ట్విట్టర్ అందించనుంది. వీటి ద్వారా స్పామ్, స్కామ్‌ను ఓడించొచ్చని మాస్క్ పేర్కొంటున్నారు. దీంతో పాటు లాంగ్ వీడియో లేదా ఆడియోను పోస్ట్ చేయొచ్చుని, సగం వరకు యాడ్స్ ఉండొచ్చని తెలిపారు. అంతేకాకుండా పేవాల్ బైపాస్‌ను పబ్లిషర్స్‌కు కూడా అందుబాటులోకి తెచ్చారు. ట్విట్టర్‌తో కలిసి పని చేసే వారికి ఈ ఫెసిలిటీ ఉంటుందని స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/