కెసిఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కుంటుపడింది

అంబేద్కర్‌ జయంతిలోపే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

L. Ramana
L. Ramana

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కుంటుపడిందని తెలంగాణ టిడిపి నేత ఎల్‌. రమణ విమర్శించారు. శనివారం కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అంబేద్కర్‌ జయంతిలోపే తొలగించిన విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అలా జరగకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఇంకా హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని ఎల్‌.రమణ ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/