మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్

మల్లారెడ్డి కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు

malla reddy

హైదరాబాద్‌: తెలంగాణ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన విషయ తెలిసిందే. తాజాగా మంత్రి మల్లారెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. ఆయన భార్య సైతం కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు వీరు ఐసొలేషన్ లో ఉన్నారు. మరోవైపు మల్లారెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 77 వేలను దాటింది. 600కు పైగా మరణాలు సంభవించాయి. కరోనా నుంచి కోలుకుని 54,330 మంది డిశ్చార్జ్ అయ్యారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/