‘కల్కి‘- తొలి రోజు కలెక్షన్స్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా అద్భుతంగా తెరకెక్కించారని..నటి నటులంతా ఎంతో బాగా నటించారని..టెక్నీకల్ టీం బాగా వర్క్ చేసారని..ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ఎంత చెప్పిన తక్కువే అంటున్నారు.

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ వసూళ్ల వర్షం సృష్టించింది. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 95 కోట్లు వసూళు చేసినట్టు అంచనా. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 180 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన 4వ సినిమాగా కల్కి రికార్డు సాధించింది. తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో వరుసగా మూడు స్థానాల్లో ‘బాహుబలి 2‘, ‘RRR’, ‘KGF 2’ ఉండగా, నాలుగో స్థానంలో ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. భారత్ లో అన్ని భాషల్లో కలిపి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రూ. 95 కోట్ల నెట్ సాధించగా, రూ. 115 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్టు సమాచారం. ఇక ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ. 65 కోట్లు వసూలు చేయగా.. హిందీలో రూ. 23 కోట్లు సాధించినట్టు సినీ విశ్లేషకుల అంచన వేస్తున్నారు. తమిళంలో 4, మలయాళంలో 2.2 వసూళు చేసింది. ఓవర్సీస్ లో దాదాపు రూ. 65 కోట్లు సాధించింది. మొత్తంగా ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 180 కోట్లు అందుకుందని. అయితే ఈ లెక్కలపై కల్కి టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.