ఉధంపూర్‌ దుర్గ్‌ ఎక్స్‌ప్రెస్‌ లో అగ్ని ప్రమాదం

ఉధంపూర్‌ దుర్గ్‌ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి చత్తీస్‌గఢ్‌ దుర్గ్‌ వెళ్తుండగా రైలులోని నాలుగు బోగీల్లో మంటలు చెలరేగాయి. రైలు హేమంత్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ దాటిని కొద్ది సేపటికే ఏ1, ఏ2 బోగీల్లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. మరో రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి. వెంటనే ప్రయాణికులను ఖాళీ చేయడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఈ సంఘటనలో ఏ1, ఏ2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంపై ఎన్‌సీఆర్‌ అధికారి డాక్టర్‌ శివం శర్మ స్పందించారు. రైలులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఎవరూ మరణించలేదని.. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బోగీల్లో ఉన్న వారిని సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు.