సిరి కి షన్ను తల్లి స్వీట్ వార్నింగ్

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం హౌస్ సభ్యుల తాలూకా కుటుంబ సభ్యులు సందడి చేస్తున్నారు. రెండు రోజులుగా ఇదే జరుగుతుంది. ఇప్పటీకే కాజల్ ఫ్యామిలీ, శ్రీరామచంద్ర చెల్లి, సిరి తల్లి, మానస్ మమ్మీలు వచ్చారు. ఇక నేటి ఎపిసోడ్‌లో సన్నీ మదర్ సందడి చేయబోతోన్నారు. ఆ తరువాత ప్రియాంక సిస్టర్, రవి ఫ్యామిలీ, చివరగా షన్ను అమ్మ వస్తారు. షన్ను తల్లి రాగానే షన్ను సంతోషం ఆపుకోలేకపోయారు.

తల్లిని చూడగానే ఎమోషనల్‌ అయి ఏడ్చేసిన షణ్ను తన కెప్టెన్‌ బ్యాండ్‌ను తల్లి చేతికి కట్టి ఆనందపడ్డాడు. దీపూను కలిసావా? ఎలా ఉందంటూ ప్రేయసి యోగక్షేమాలు ఆరా తీశాడు. దీంతో షణ్ను తల్లి.. వందసార్లు అడగకు, దీపూ బాగానే ఉందని చెప్పింది. ఇంతలో అక్కడికి సిరి రాగా.. గేమ్‌ను గేమ్‌లా ఆడండి.. ఎక్కువ ఎమోషనల్‌ అయిపోవద్దు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్ తో సిరి షాక్ అయ్యింది.

నిన్న సిరి తల్లి కూడా ఇలాగే మాట్లాడింది. షణ్నుకు దగ్గరవుతున్నావు, కానీ అతడిని హగ్‌ చేసుకోవడమే నచ్చలేదు అని సిరి తల్లి బిగ్‌బాస్‌ హౌస్‌లో సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో హౌస్‌మేట్స్‌ అందరూ షాకవగా షణ్ను అయితే తలెత్తుకోలేకపోయాడు. ఆమె అలా అంటుంటే సిరి దాన్ని ఆపకుండా సైలెంట్‌గా ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు. ఇంత చేసి ఇలాంటి మాటలు పడాల్సి వచ్చిందేనని కుంగిపోయి ఏడ్చేశాడు. మొత్తం మీద సిరి – షన్ను ల వ్యవహారం ప్రేక్షకులకే కాదు కుటుంబ సబ్యులకు కూడా నచ్చడం లేదని అర్థమైపోయింది.

YouTube video