మరింత క్షీణించిన ప్రణబ్‌ ఆరోగ్యం..ఆసుపత్రి

ప్రమాదకరస్థాయిలో తగ్గిపోయిన బీపీ

మరింత క్షీణించిన ప్రణబ్‌ ఆరోగ్యం..ఆసుపత్రి
Pranab Mukherjee

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఆర్మీ ఆసుపత్రి తాజా బులెటిన్‌లో విడుదల చేసింది. ప్రణబ్ ముఖర్జీ మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ నిర్వహించారు. అదే సమయంలో, ఆయనకు కరోనా కూడా సోకింది. దీంతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో నిన్నటి నుంచి ఆయన పరిస్థితి మరింత క్షీణించిందని ఆర్మీ ఆసుపత్రి తెలిపింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన బీపీ ప్రమాదకరస్థాయిలో తగ్గిపోయిందని వివరించింది. ప్రణబ్‌కు ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోందని తెలిపింది. ఆయన ఇప్పటికీ కోమాలోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/