రేణుగుంట కార్తికేయ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..ముగ్గురు మృతి

తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆదివారం తెల్లవారు జామున భగత్‌సింగ్ కాలనీలో నూతనంగా నిర్మించిన కార్తికేయ హాస్పిటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి , ఇద్దర్ని కాపాడగలిగారు.

వివరాల్లోకి వెళ్తే..

రేణిగుంటకు చెందిన డాక్టర్ రవిశంకర్‌ రెడ్డి తన భార్య డాక్టర్ అనంత లక్ష్మి కలిసి భగత్‌సింగ్ కాలనీలో నూతనంగా కార్తికేయ హాస్పిటల్ నిర్మించుకొని అక్కడే చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి పైఅంతస్తులోనే వీరు నివాసం ఉంటున్నారు. రవిశంకర్‌ రెడ్డి , ఇద్దరు పిల్లలు సైతం వీరితోనే ఉంటున్నారు. కాగా ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకొని , మొత్తం హాస్పటల్ ను అంటుకున్నాయి. అగ్ని ప్రమాద విషయాన్నీ తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన చేరుకొని , మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రెస్క్యూ టీం అతి కష్టం మీద పైఅంతస్తుకు వెళ్లి రవిశంకర్‌రెడ్డి తల్లి, భార్య అనంతలక్ష్మిని ప్రాణాలతో కాపాడగలిగారు. మంటల వేడి, పొగ కారణంగా ఇద్దరు పిల్లలు ఊపిరి ఆడకచనిపోగా, డాక్టర్ రవిశంకర్ రెడ్డి మాత్రం మంటలకు చిక్కుకొని సజీవ దహనము అయ్యారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఒకే రోజు ముగ్గుర్ని పోగొట్టుకోవడంతో అనంత లక్ష్మి కన్నీరు మున్నీరు అవుతుంది.