రెండేళ్ల వేతనం విరాళంగా ప్రకటించిన గంభీర్‌

కరోనాపై పోరుకు ప్రజలు కూడా సహకరించాలి

goutham gambhir
goutham gambhir

దిల్లీ: దేశంలో కరోనా నివారణకు ప్రధాని నరేంద్రమోది విరాళాలు కోరిన విషయం తెలిసిందే, కరోనా పై పోరుకు దేశంలోని ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. తాజాగా బిజెపి ఎంపి, మాజీ క్రికెటర్‌ తనవంతుగా తన రెండేళ్ల వేతనాన్ని పిఎం-కేర్స్‌ కు విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే దేశంలో రెండు వేల మందికి కరోనా సోకింది. యాబైమంది దీని కారణంగా మరణించారు. ఈ మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు ప్రజలందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దేశం మాకు ఏమి ఇచ్చిందని ప్రజలు అడుగుతున్నారు. కాని ఈ దేశం కోసం మీరు ఏమి చేయగలరు? అన్నదే అసలు ప్రశ్న. పిఎం-కేర్స్‌ ఫండ్‌కు నా రెండేళ్ల జీతాన్ని విరాళంగా ఇస్తున్నా. మీరు కూడా ముందుకు రావాలి. అని గంభీర్‌ ట్వీట్‌ చేశాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/