అతడి బౌలింగ్‌ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. యువీ

yuvaraj
yuvaraj

ముంబయి: తనను బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్‌, శ్రీలంక స్పిన్‌ లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ అని భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ వెల్లడించాడు. ఎంతమంది బౌలర్లను ఎదుర్కొన్నప్పటికీ.. ఈ స్పిన్‌ మాంత్రికుడి బౌలింగ్‌ లో మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. అతను విసిరే బంతులకు నా దగ్గర సమాధానం ఉండేది కాదు. మురళీధరన్‌ బౌలింగ్‌ ను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుత్ను సమయంలో సచిన్‌ స్వీప్‌ షాట్స్‌ ఆడాల్సిందిగా సూచించాడు. ఈ సూచన ఫలించడంతో దానిని ఫాలో అయ్యానని యువీ తెలిపాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/