ఇద్దరు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేకు కరోనా

అంత్యక్రియల్లో పాల్గొనడంతో పాజిటివ్

Corona outbreak in 2021-AIIMS
Corona

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తో పాటు తూర్పు గోదావరి జిల్లా, తుని శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల తన తండ్రి దశరథరామిరెడ్డి మరణించడంతో, అంత్యక్రియల్లో పాల్గొన్న వేళ, ఎవరి ద్వారానోఆళ్ల రామకృష్ణాకు కరోనా సోకినట్టు సమాచారం. తనకు కరోనా సోకడంతో రెండు వారాల పాటు హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లనున్నానని ప్రకటించిన ఆళ్ల రామకృష్ణా, ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని, పరీక్షలు చేయించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు. మరోపక్క, దాడిశెట్టి రాజా చెబుతూ, వైద్య చికిత్స పొందేందుకు తాను విశాఖపట్నంలోని ఆసుపత్రికి వెళ్లానని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/