ఢిల్లీలో కరోనా కలకలం..పాఠశాలలు మూసివేత

ఇప్పటికే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 53 మంది

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో కేసులు ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 53 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈరోజు మరో 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తున్నట్టు మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ సందర్భంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. పాఠశాలల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని… ఈ నేపథ్యంలో స్కూళ్లను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. ఇంకోవైపు ఢిల్లీలో గత 24 గంటల్లో 366 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 18,67,572కి చేరుకుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/