ఆ కోరిక తీరింది

తన కలల కారును సొంతం చేసుకున్నానని సన్నీలియోన్ వెల్లడి

Sunny leone
Sunny leone with Maserati Levante car

మసెరటి లీవెంటే బ్రాండ్ లగ్జరీ కారు అంటే సన్నీకి చాలా ఇష్టమట. దీని ఖరీదు అక్షరాలా కోటి 45 లక్షలు.

ఈ లగ్జరీ కార్ ని సొంతం చేసుకోవాలని తన కోరికని తీర్చుకోవాలని చాలా రోజులుగా ఎదురుచూస్తోందట.

ఆ కోరికని ఇన్నాళ్లకు తీర్చుకుంది సన్నీ. తన కలల కారు సొంతం కావడంతో మసెరటితో మెరిసిపోయింది. సంబరంలో మునిగితేలింది.

`నిన్ననే ఇంటికి తీసుకొచ్చాను. ఈ కారును నడిపిన ప్రతిసారీ నేను చాలా సంతోషంగా ఉన్నాను` అని ఇన్ స్టాలో మసెరటితో మెరిసిపోతున్న ఫొటోని షేర్ చేసింది సన్నీ.

అన్నట్టు సన్నీలియోన్ తన దత్త పుత్రికలు భర్త సహా ఇటీవల అమెరికాలో అత్తారింట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడే అత్తమామలకు సేవలందిస్తోంది ఈ బ్యూటీ.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/