రాజ్యస‌భ‌లో సెంచ‌రీ కొట్టిన బీజేపీ

రాజ్య స‌భ‌లో బీజేపీ సెంచ‌రీ కొట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. 1988 నుంచి రాజ్య స‌భ‌లో ఏ పార్టీ కూడా 100 సీట్ల‌ను తెచ్చుకోలేదు. అలాంటిది ఇప్పుడు బీజేపీ ఫస్ట్ టైం సెంచరీ కొట్టి రాజ్యసభ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

కేంద్రంలో వ‌రుస‌గా రెండు సార్లు అధికారాన్ని చేప‌ట్టిన భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ).. పార్ల‌మెంటులోని దిగువ స‌భ‌లో ఎప్పుడో క్లిస్ట‌ర్ క్లియ‌ర్ మెజారిటీ సాధించినా.. పెద్ద‌ల స‌భ‌గా ప‌రిగ‌ణిస్తున్న ఎగువ స‌భ రాజ్య‌స‌భ‌లో మాత్రం మెజారిటీ సాధించ‌లేక‌పోయింది. అయితే ఇటీవ‌లే ముగిసిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాల‌ను ద‌క్కించుకున్న బీజేపీ.. రాజ్య‌స‌భ‌లో త‌మ స‌భ్యుల సంఖ్య‌ను 100కు చేర్చుకుంది.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ సాధించడంతో ఎగువసభలో బీజేపీ సంఖ్యా బలం 101 ఎంపీలకు చేరుకుంది. గురువారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 13 స్థానాలకు గాను బీజేపీ 4 సీట్లు గెలుచుకుని ఈ అరుదైన ఫీట్ సాధించింది. అసోంలో బీజేపీ భాగస్వామ్య పార్టీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) ఒక రాజ్యసభ సీటు గెలుచుకుంది. మూడు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపుర, నాగాలాండ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది.