కాసేపట్లో కేసీఆర్ ను పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడుతుంది. గురువారం రాత్రి తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక విరిగింది. దీంతో యశోద హాస్పటల్ వైద్య బృందం శుక్రవారం సాయంత్రం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేసారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. డాక్టర్స్ ఆయన్ను వాకర్ సాయంతో నడిపిస్తున్నారు. ఇక కేసీఆర్ హాస్పటల్ లో చేరిన దగ్గరి నుండి బిఆర్ఎస్ నేతలు , శ్రేణులు పెద్ద ఎత్తున హాస్పటల్ కు వెళ్లి ఆయన ఆరోగ్యం ఫై ఆరా తీస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హాస్పటల్ కు వెళ్లి పరామర్శించనున్నారు.

కేసీఆర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయాల్ని పక్కనబెట్టి ప్రతిపక్ష నేతను కలవాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై పలువురు మేధావులు, రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.