కేసీఆర్ కు రెండు చోట్ల విరిగిన తుంటి ఎముక

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నిన్న రాత్రి తన ఫేమహౌస్ లో కాలు జరికింద పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కేసీఆర్ తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయనకు ఆపరేషన్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ కోలుకోవడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చని చెపుతున్నారు.

కేసీఆర్ అస్వస్థతకు గురైన వార్తా తెలిసిన కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు.
కేటీఆర్‌ కుటుంబంతోపాటు హరీష్‌రావు కూడా రాత్రే యశోదాకి వెళ్లారు. తెల్లవారుజాము వరకూ అక్కడే ఉన్నారు. వైద్యులతో మాట్లాడిన తర్వాత.. కాసేపట్లో చేయబోయే వైద్య పరీక్షలపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చాక ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌కి యశోదా ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్‌లో చికిత్స కొనసాగుతోంది. ఇవాళ వైద్యులు టెస్ట్‌లు చేసిన తర్వాత హెల్త్‌ బులెటిన్‌ ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కేసీఆర్ ఆరోగ్యం తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ నేతలు , శ్రేణులు హాస్పటల్ కు చేరుకుంటున్నారు.