క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానిని పలకరించిన ప్రభాస్

హీరోలంటే కేవలం తెరపై మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకోవాలి. తెలుగు ఇండస్ట్రీ కి వస్తే చాలామంది హీరోలు రియల్ హీరోస్ అనిపించుకుంటుంటారు. తెలుగు ప్రజలకు ఏ ఆపద వచ్చిన వారిని ఆర్ధికంగా ఆదుకుంటుంటారు. అలాగే ఎవరైనా అభిమానులు చావుబ్రతుకుల మధ్య ఉంటె వారిని కలుసుకొని వారికీ ధైర్యం చెపుతుంటారు. తాజాగా యంగ్ రెబెల్ స్టార్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న అభిమానితో మాట్లాడి ఆమెను సంతోష పరిచారు.

కొద్ది రోజుల క్రితం శోభిత అనే అమ్మాయి అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక డాక్టర్లు ఆమె ఇష్టాఇష్టాలను తెలుసుకోగా.. ప్రభాస్‌ అభిమానినని, ఆయనతో మాట్లాడాలని ఉందని చెప్పింది. శోభిత కోరిక మేర‌కు ప్ర‌భాస్‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. శ‌నివారం ప్రభాస్‌ వీడియో కాల్‌ చేసి మాట్లాడి ఆమెకు ఆనందాన్ని పంచారు. దీంతో ఆ క్యాన్సర్ పేషేంట్ చాలా సంతోషించింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ప్రభాస్ “మిర్చి” సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు, భీమవరంలో మృత్యువుకు దగ్గరవుతున్న తన 20 ఏళ్ల అభిమానిని ఇలాగే ఆశ్చర్యపరిచాడు. ప్రభాస్‌ను చూసిన తర్వాత బాలుడు 20 రోజులకు పైగా జీవించాడని అతని తండ్రి మీడియా చెప్పారు.

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన ప్ర‌భాస్ ఇప్పుడు స‌లార్, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ అనే చిత్రాలు చేస్తున్నాడు.