ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ టాక్

నితిన్ – శ్రీలీల జంటగా వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. మంచి అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందనేది అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మాత్రమే.. ఇంటలెక్ష్యువల్ సినిమాలను చూడాలుకునే వారు దూరంగా ఉండండి.. మీరు సినిమాను చూసి నెగెటివ్ చెప్పాల్సిన పని లేదు..

ఈ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ నవ్వుతారు.. నవ్వకపోతే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందే.. సెకండాఫ్‌లో సాంగ్స్ అనేవి అదనపు ఆకర్షణగా మారాయి అని చెపుతున్నారు. ఎస్సై సాయి నాథ్ కారెక్టర్లో నితిన్ అదరగొట్టేశాడు.. స్పెషల్ అప్పియరెన్స్‌లో రాజశేఖర్ కారెక్టర్ అదుర్స్.. వంద శాతం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ.. నాన్ స్టాప్ నవ్వులే నవ్వులు.. రొటీన్ స్టోరీనే అయినప్పటికీ జూ. ఆర్టిస్ట్‌గా నవ్వించేశాడు అని అంటున్నారు. ఓవరాల్ గా కామెడీ ఎంటర్టైనర్ గా అని గట్టిగా చెపుతున్నారు.