కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి

one-shot-dead-one-injured-in-shopian

శ్రీనగర్‌ః కశ్మీర్‌లో ఉగ్రమూక మళ్లీ రెచ్చిపోయారు. షోపియాన్‌లోని చోటిపోరా ప్రాంతంలోని యాపిల్‌ తోటలో వలస కార్మికులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని.. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. కశ్మీర్ లోయలో గత 24 గంటల్లో మైనారిటీ వర్గానికి చెందిన వారిపై దాడి జరుగడం ఇది రెండోసారి. సోమవారం అర్ధరాత్రి సెంట్రల్‌ కశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లాలోని గోపాల్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్‌ దాడి చేయగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/