ఇక బిఆర్ఎస్ కు తిరుగుండదని అంటున్న జ్యోతిష్య నిపుణులు

టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయ్యింది. ఎన్నికల సంఘం బీఆర్ఎస్ కు ఆమోదం తెలుపడం తో శుక్రవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన నివాళులు అర్పించితిన్ కేసీఆర్.. బీఆర్ఎస్ ను గుర్తిస్తూ ఈసీ పంపిన లేఖపై రిప్లైగా మధ్యాహ్నం 1.20 నిమిషాలకు సంతకం చేశారు.

ఇక బిఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి ముహూర్తం బ్రహ్మాండంగా కుదిరిందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీకి తిరుగుండదని , ముహూర్త సమయానికి గ్రహగతులన్నీ అనుకూలంగా ఉన్నాయని, దీనికి తోడు మీన లగ్నం కావడం కలిసొచ్చే అంశమని సిద్ధాంతులు చెబుతున్నారు. దసరా పండుగ రోజు జాతీయ పార్టీని ప్రకటించిన ముహూర్తానికి ‘గురువు’ అనుగ్రహం పరిపూర్ణంగా కుదిరిందని, తాజాగా నేటి ముహూర్తానికి కూడా గురువే పాలకగ్రహం అయ్యిందని, ఇది విశేషమని వివరిస్తున్నారు. లగ్నంలో.. అందులోనూ స్వక్షేత్రంలో ‘గురువు’ ఉండటం, భాగ్య స్థానంలో రవి, ‘రాజ్య’ స్థానంలో బుధ, శుక్రులు ఉండటం, ‘లాభ’ స్థానంలో శని స్వక్షేత్రంలో ఉండటం శుభప్రదమని, యోగదాయకమని అభిప్రాయపడుతున్నారు.

బిఆర్ఎస్ గా ఆవిర్భవించిన సందర్బంగా సీఎం కేసీఆర్‌కు జేడీఎస్ చీఫ్ కుమార‌స్వామి, న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం బీఆర్ఎస్ కండువాను కేసీఆర్ ధ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయ‌కులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. . ‘తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకొన్నామో.. అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు కదులుదాం’ అని సీఎం కేసీఆర్‌ దసరా రోజు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘మన పార్టీ పేరు ఇకపై భారత రాష్ట్ర సమితి’ అని నాడు ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. పేరు మార్పును ఆమోదిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు గురువారం లేఖ రాసింది. దీంతో టీఆర్‌ఎస్‌ నేటి నుంచి బీఆర్‌ఎస్‌గా అవతరించింది.