జే ట్యాక్స్‌ పేరుతో ఏడాదికి ఇరవై వేల కోట్లు దోపిడీ

పితాని, అచ్చెన్నాయుడుపై తప్పుడు ప్రచారం

nimmala ramanaidu
nimmala ramanaidu

పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జే ట్యాక్స్‌ పేరుతో ఏడాదికి ఇరవై వేల కోట్లు దోపిడీ చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంగళవారం ఉదయం పాలకొల్లు బ్రాడీపేటలో జనచైతన్య పాతయాత్రను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టిడిపిలోని బీసీ నాయకులను రాజకీయంగా అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. మాజీ మంత్రులు, పితాని సత్యనారయణ, అచ్చెన్నాయుడుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రామానాయుడు మండిపడ్డారు. ప్రభుత్వం ఎనిమిది నెలల కాలంలో నియమించిన 300 నామినేటెడ్‌ పదవులలో 250 మంది సీఎం జగన్‌ సామాజిక వర్గం వారే అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/