అందువల్లే టీమిండియా గెలవలేకపోయింది

మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌

Sanjay Manjrekar
Sanjay Manjrekar

ముంబయి: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఓటమికి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీయే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు ఇన్నింగ్స్‌లో కోహ్లీ త్వరగా పెవిలియన్‌ చేరాడు. బహుశా అతడు బాగా ఆడి మంచి పరుగులు చేసి ఉంటే న్యూజిలాండ్‌ గెలిచి ఉండేది కాదు. కానీ కివీస్‌ జట్టు తమ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేయడంలోల సఫలం అయ్యింది. టీమిండియా కౌంటర్‌ ఎటాక్‌ చేయడానికి ఎవరూ నిలబడలేకపోయారు. అందువల్లే టీమిండియా తొలి టెస్టులో గెలవలేకపోయింది అని మంజ్రేకర్‌ అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/