హ‌మాస్ మిలిటెంట్ల చేతుల్లో ఉక్రెయిన్ ఆయుధాలు : ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్

ukraine-selling-weapons-to-hamas-said-putin

మాస్కో: హ‌మాస్ మిలిటెంట్ల చేతుల్లో ఉక్రెయిన్ ఆయుధాలు ఉన్న‌ట్లు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌కు పంపిన ఆయుధాలు హ‌మాస్ తీవ్ర‌వాదుల చేతుల్లోకి చేరిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. పాల‌స్తీనాలోని హ‌మాస్‌కు ఉక్రెయిన్ ఆయుధాలు అంది ఉంటాయ‌ని అనుమానాలు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఉక్రెయిన్‌లో అవినీతి చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంద‌ని, ఆయుధాలను కొనుగోలు చేయాల‌నేవారి కోసం అక్క‌డ బ్లాక్ మార్కెట్ ఉంటుంద‌ని, ఆ దేశంలో ఆయుధాలు అమ్మేవాళ్లు చాలా మంది ఉంటార‌ని పుతిన్ అన్నారు. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఉక్రెయిన్ ఆయుధాలు అమ్ముతోంద‌ని పుతిన్ ఆరోపించారు.