నటుడు రాజా శ్రీధర్ కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు

తెలుగు సినిమాలు, సీరియల్స్ ద్వారా మనందరికీ సుపరిచితుడైన నటుడు రాజా శ్రీధర్ కొత్త బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. శ్రీధర్ ప్రాపర్టీస్ అనే సంస్థ ద్వారా రియల్ ఎస్టేట్ రంగం లోకి గ్రాండ్ గా ఏంటీ ఇచ్చాడు. తన ప్రాణ మిత్రుడు .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ రోజు శ్రీధర్ ప్రాపర్టీస్ బ్రోచర్ అండ్ వెబ్సైటు ను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా రాజా శ్రీధర్ మాట్లాడుతూ.. తనకి అత్యంత ఆప్తుడే కాదు, ఇండియాస్ మోస్ట్ ఫేవరేట్ హీరో అయిన ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం తన అదృష్టం అని ఈ సందర్బంగా ఆయనికి ధన్యవాదములు తెలుపుతూ, శ్రీధర్ ప్రాపర్టీస్ ద్వారా రియల్ ఎస్టేట్ సంస్థలకు వీడియో మార్కెటింగ్ సర్వీసెస్లను అందించిడమే కాకుండా అన్నీ రకాల ప్రాపర్టీస్ నూ అన్నీ వర్గాల వారికీ అందించేందుకు కృషి చేస్తామని.. సంస్థ కార్యకలాపాలు, వివరాలు కోసం శ్రీధర్ ప్రాపర్టీస్ డాట్ ఇన్ వెబ్సైటు ద్వారా తెలుసుకోవచ్చని శ్రీధర్ తెలిపారు.