నేడు టీఆర్ఎస్ లోకి ఎల్. రమణ

ఉదయం 11.30 గంటలకు కేటీఆర్ చేతుల మీదుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం

హైదరాబాద్ : టీటీడీపీ మాజీ నేత ఎల్.రమణ నేడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో ప్రాథమిక సభ్యత్వాన్ని అందుకుంటారు. అలాగే 16న హుజూరాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు. రమణతోపాటు మరికొందరు టీఆర్ఎస్‌లో చేరునున్నట్టు తెలుస్తోంది.

కాగా, రమణ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తొలుత ఈ వార్తలను ఖండించిన ఆయన గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. తన ఎదుగుదలకు 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు అందులో హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/