సీనియర్ జర్నలిస్ట్ ఇలపావులూరి మురళీ మోహన్ రావు మృతి

సీనియర్ జర్నలిస్ట్ ఇలపావులూరి మురళీ మోహన్ రావు గుండెపోటుతో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మురళీ మోహన్ రావు.. 40 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌ లో స్థిరపడ్డారు. ఆదివారం సెలవు కావడంతో తన కుటుంబంతో స్వస్థలమైన అద్దంకి వెళ్లారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన ఒంగోల్‌లోని హాస్పటల్ కు తరలించారు.

అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మోహన్ రావు మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. మురళీ మోహన్ రావు మృతిపట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం తెలిపారు. పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు స‌ద్గతులు చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు.