చైనాలో కుండపోత వర్షాలు..141 మంది మృతి

Torrential rain in China claims 141 lives

బీజింగ్‌: చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో యాంగ్జీనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గురువారం కురిసిన భారీ వర్షానికి యాంగ్జీనది ఎగువ పరిధిలోని పర్వత పట్టణమైన చాంగ్కింగ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద కారణంగా ఇప్పటి వరకు 141 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. యాంగ్జీనదిపై నిర్మించిన రిజర్వాయర్‌లోకి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు సెకనుకు 50 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా ప్రస్తుతం 55 వేల క్యూసెక్కుల వరకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదల కారణంగా నదుల ఎగువ ప్రాంతాలు, పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగి యాంగ్జీనదితోపాటు త్రీగోర్జస్‌ రిజర్వాయర్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/