దేశంలో కొత్తగా 1,569 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,400

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 3.57 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 1,569 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందు రోజు కంటే దాదాపు 600 కేసులు తగ్గడం గమనార్హం.

మరోవైపు, గత 24 గంటల్లో 2,467 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 16,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,25,84,710 మంది కోలుకున్నారు. మొత్తం 5,24,260 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 191 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/