ఏకాంతంగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు: టీటీడీ చైర్మ‌న్

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో నిర్ణ‌యం
అక్టోబ‌రు 7 నుంచి అదే నెల 15 వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమల: తిరుమ‌ల తిరుప‌తిలో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుపుతామ‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. అలాగే, మూడో ద‌శ క‌రోనా హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలపై ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

అక్టోబ‌రు 7 నుంచి అదే నెల 15 వ‌ర‌కు వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని వైవీ సుబ్బారెడ్డి వివ‌రించారు. ఈ ఏడాది కూడా బ్ర‌హ్మోత్స‌వాలు ఆల‌యానికే ప‌రిమితమ‌వుతాయ‌ని చెప్పారు. వాహ‌న సేవ‌ల‌న్నీ ఆల‌య‌ప్రాకారానికి ప‌రిమితమ‌వుతాయ‌ని వివ‌రించారు. కాగా, గ‌త ఏడాది కూడా శ్రీ‌వారిని బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగానే నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/