నెల రోజుల పాటు విదేశాల్లో గడపబోతున్న మహేష్

నెల రోజుల పాటు విదేశాల్లో గడపబోతున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నెల రోజుల పాటు విదేశాల్లో గడపబోతున్నాడు. మహేష్ కు విదేశాలకు వెళ్లడం కొత్తమీ కాదు..కాకపోతే ఎప్పుడు వెళ్లిన ఓ వారం రోజులో..లేక పదిరోజుల్లో గడుపుతుంటాడు. కానీ ఈసారి మాత్రం ఏకంగా నెల రోజుల పాటు విదేశాల్లో గడపనున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు..పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ ఫై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ నిమిత్తం మహేష్ బాబు స్పెయిన్ దేశం వెళ్లనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. ఈ నెలాఖరున స్పెయిన్‌లో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారట మేకర్స్. ఇందులో భాగంగా చిత్రంలోని రెండు పాటల షూటింగ్‌తో పాటు కొంత భాగం టాకీ పార్ట్ షూట్ చేయనున్నారని సమాచారం. అంటే దాదాపు నెల రోజుల పాటు చిత్ర యూనిట్ మొత్తం అక్కడే ఉండనుంది. ఆ వెంటనే డిసెంబర్‌లో మరో షెడ్యూల్ పూర్తి చేసి షూటింగ్ పూర్తీ చేసి..సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని అంటున్నారు.