భారత మహిళా హాకీ జట్టుకు వజ్రాల వ్యాపారి భారీ కనుక

సొంత ఇల్లు లేకుంటే రూ. 11 లక్షలు, ఉంటే రూ. 5 లక్షల విలువైన కారు..వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా

గుజరాత్ : టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటుతూ సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల హాకీ జట్టుపై ప్రశంసలు కురుస్తుండగా, గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి వారికి భారీ నజరానా ప్రకటించారు. జట్టులో ఇల్లులేని క్రీడాకారిణిలకు సొంత ఇంటి నిర్మాణానికి రూ. 11 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్టు వ్యాపారి సావ్జీ ధోలాకియా ప్రకటించారు. సొంత ఇల్లు ఉన్న క్రీడాకారిణులకు రూ. 5 లక్షల విలువైన కారు బహుమానంగా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అలాగే, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కూడా లక్ష రూపాయల చొప్పున ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

కాగా భారత జట్టు సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిపోయి స్వర్ణ పతకం అవకాశాలను చేజార్చుకుంది. ప్రస్తుతం కాంస్య పతకం కోసం గ్రేట్ బ్రిటన్‌తో తలపడుతోంది. భారత జట్టు పతకం సాధిస్తే ఒకే ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల హాకీ జట్లు పతకం సాధించిన రికార్డు భారత్ సొంతమవుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/