టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం

అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) సమావేశం ప్రారంభమైంది. చైర్మన్‌ వైవీ సుబ్బా రెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈ సమావేశం ప్రారంభమైంది. 108 అంశాల అజెండాపై చర్చించి పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. సమావేశానికి మెజారిటీ సభ్యులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరికొందరు సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. కాగా, ఈ సమావేశంలో శ్రీవారి ఆలయంలో దర్శనాలు పెంపు, గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు,వరాహస్వామి ఆలయ గర్బాలయ వాకిలికి దాత సహాయంతో 180 కేజిల వెండితో తాపడం పనులు, తిరుపతి ఆలయంలో పుష్పకైంకర్యానికి వినియోగించే పుష్పాలతో అగరబత్తులు తయారీకి ప్లాంట్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/